తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని హైదరాబాద్ నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అన్నారు. జీహెచ్ఎంసి ప్రధాన కార్యాలయ సముదాయంలో ఘనంగా నిర్వహించిన బతుకమ్మ సంబురాలలో విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతరెడ్డి పాల్గొన్నారు. ముందుగా వారు బతుకమ్మలకు పూజలు చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. తీరొక్క పూలతో పేర్చిన భారీ బతుకమ్మల చుట్టూ మహిళా అధికారులు, ఉద్యోగులతో కలిసి మేయర్, డిప్యూటీ మేయర్ బతుకమ్మ ఆడి సందడి చేశారు. ఈ నెల 20న కేబీఆర్ పార్క్ వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మేయర్ విజయలక్ష్మి తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను విజయలక్ష్మి ఆవిష్కరించారు.