ఎక్కడ డ్రగ్స్ కేసు బయటపడినా దాని లింకులు అటు తిరిగి ఇటు తిరిగి చివరికి టాలీవుడ్ కు చేరుతున్నాయి. తాజాగా తెర మీదకు వచ్చిన బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారం టాలీవుడ్‌ను కుదిపే స్తోంది. టాలీవుడ్‌కు చెందిన హేమతో పాటు ఆషి రాయ్ అనే ఒక నటి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు, వారు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఇప్పటికే నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా పోలీసుల అదుపులో లేరు కానీ ఇప్పుడు పోలీసులు వారికి నోటీసులు ఇచ్చారు. ఈ పార్టీలో 73 మంది యువకులు పాల్గొనగా 59 మందికి పాజిటివ్ అని తేలింది. 30 మంది యువతులు పాల్గొనగా 27 మందికి పాజిటివ్ అని తేలింది. మొత్తం 130 మంది పార్టీలో ఉంటే, 86 మందికి డ్రగ్స్ ట్రెసెస్ పాజిటివ్ అని తేలడం సంచలనంగా మారింది.
ఈ కేసుపై నటి కరాటే కల్యాణి కీలక వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసులు నమోదు కావడం బాధాకరం అన్న ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయిన హేమ మా అసోసియేషన్ సభ్యత్వాన్ని తొలగిస్తామన్నారు. మంచు విష్ణు హైదరాబాద్ రాగానే హేమపై చర్యలు తీసుకునేలా ప్రయత్నం చేస్తామని కరాటే కళ్యాణి వెల్లడించారు. మరోవైపు నటి హేమ బెంగళూరు వెళ్లినట్లు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. మే 18మధ్యాహ్నం హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్లారు. మధ్యాహ్నం 1:55 ఫ్లైట్‌కు శంషా బాద్ నుండి ఇండిగో విమానంలో బెంగళూరుకు బయల్దేరారు. ఇండిగో 6E – 6305 విమానంలో వెళ్లిన హేమ. మధ్యాహ్నం 3:15 కు బెంగళూరు చేరుకున్నారు. హేమతో పాటు కాంతి, రాజశేఖర్ బెంగళూరు వెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది.
నటి హేమ ఆడిన డ్రామాలు అన్నీ ఇన్నీ కావు. తాను బెంగళూరు రేవ్ పార్టీలో లేనని నిరూపించుకు నేందుకు నానా ప్రయత్నాలు చేసింది. బెంగళూరు రేవ్ పార్టీ విషయం మీడియాలో రాగానే, వెంటనే ఓ వీడియో రిలీజ్ చేసింది. తాను హైదరాబాద్‌లోనే ఉన్నానని, మీడియాలో వస్తున్న వార్తలు నమ్మొద్దని చెప్పింది. బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన ట్లు వస్తున్న వార్తలు అబద్ధమని ఖండించింది. కావాలంటే తనకు వీడియో కాల్ చేసుకోవాలని అన్నారు. హేమ వీడియో రిలీజ్ చేసిన కొద్ది సమయం తర్వాత బెంగళూరు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టారు. రేవ్ పార్టీలో దొరికిన నటి ఫోటో అంటూ హేమ ఫోటో విడుదల చేశారు. అయితే ఆమె పేరును అసలు పేరు కృష్ణవేణితో బెంగళూరు రేవ్ పార్టీకి హాజరైనట్టు తెలుస్తోంది. ఆ తర్వాత కిచెన్‌లో బిర్యానీ చేస్తున్న వీడియోను విడుదల చేసింది హేమ. మొత్తానికి తాను బెంగళూరు రేవ్ పార్టీలో పాల్గొనలేదని జనాన్ని నమ్మించేందుకు పడరాని పాట్లు పడింది. కానీ చివరకు డ్రగ్స్ టెస్టుల్లో అడ్డంగా బుక్కైంది.


