అయోధ్య రాముడి విషయంలో కాంగ్రెస్ నేతలపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని బీజేపీ ఎంపీ బండి సంజయ్ స్పష్టం చేశారు. తనను అనవసరంగా గెలుకుతున్నారని అన్నారు. తాను ఎవరిని వ్యక్తిగతంగా విమర్శించలేదన్నారు. రాముడు పేరిట ఎన్నికల్లో నిలుచుంటానని, తాను ఓడితే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారు. కాంగ్రెస్ ఓడిపోతే పొన్నం రాజకీయాలు వదిలేస్తారా అంటూ సవాల్ విసిరారు. కేటీఆర్ వాగుడుతో బీఆర్‌ఎస్ మునిగిందని, పొన్నంతో కాంగ్రెస్ మునగడం ఖాయం అంటూ బండి సంజయ్ విమర్శించారు.


