Bandi Sanjay | బీఆర్ఎస్ అంటే.. బలత్కారిస్ట్స్.. రేపిస్ట్స్.. సెక్సువల్ వేధింపుదారులు అని సరికొత్త నిర్వచనం చెప్పారు బీజేపీ చీఫ్ బండి సంజయ్. ట్విటర్ వేదికగా సీఎం కేసీఆర్, కేటీఆర్ ను టార్గెట్ చేస్తూ.. బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు. అధికార బీఆర్ఎస్ పార్టీ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటోందని బండి ట్వీట్ చేశారు. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో ట్విట్టర్ టిల్లు వేదికను పంచుకున్నారని కేటీఆర్(KTR)ను ఉద్దేశిస్తూ పేర్కొన్నారు. గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీకి ప్రభుత్వ విప్ పదవి ఇచ్చారని మండిపడ్డారు.
మహిళా సర్పంచ్ ని లైంగికంగా వేధించిన మాజీ ఆరోగ్య మంత్రి గతంలో కేసీఆర్‌తో వేదిక పంచుకున్న వారేనని గుర్తుచేశారు. మహిళా ప్రభుత్వ ఉద్యోగిని దుర్బాషలాడిన ఓ బీఆర్ఎస్(BRS) మంత్రిని ఏకంగా సీఎం మెచ్చుకున్నారని తెలిపారు. బీజేపీ మహిళా నేతలపై సోషల్ మీడియాలో దుర్భాషలాడిన బీఆర్ఎస్ అనుచరులను ఇంకా అరెస్ట్ ఎందుకు చేయరని బండి(Bandi Sanjay) ప్రశ్నించారు. మంగళవారం మరదలు అంటూ ఓ మహిళపై వ్యాఖ్యలు చేసిన మంత్రి… ఇంకా పదవిలో కొనసాగుతున్నారని.. ఇది చాలా దురదృష్టకరమన్నారు.
Read Also: తెలుగు జాతికి నిత్య స్మరణీయుడు ఎన్టీఆర్: నందమూరి బాలకృష్ణ
Follow us on: Youtube, Instagram, Google News