24.2 C
Hyderabad
Wednesday, January 15, 2025
spot_img

‘పేపర్ లీకేజీ బాధ్యుడు నీ కొడుకే కేసీఆర్’.. అంటూ నిప్పులు చెరిగిన బండి సంజయ్

Bandi Sanjay |‘‘పేపర్ లీకేజీ బాధ్యుడు నీ కొడుకే … టీఎస్పీఎస్సీ కంప్యూటర్ల నిర్వహణ బాధ్యతంతా ఐటీ శాఖదే… మరి ఆయనను బర్త్ రఫ్ చేస్తారా? లోపలేసి తొక్కే దమ్మ కేసీఆర్ కు ఉందా? తప్పు ఎవరు చేసినా… చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదని అసెంబ్లీలో చెప్పిన మాటలకు కేసీఆర్ కట్టుబడి కొడుకును కేబినెట్ నుండి బర్త్ రఫ్ చేస్తారా?’’ అంటూ రాష్ట్ర బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై జరిగిన పోరాటంలో అరెస్టై చంచల్ గూడ జైల్లో ఉంటున్న బీజేవైఎం నాయకులను కొద్దిసేపటి క్రితం బండి సంజయ్ పరామర్శించారు. అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, ఎస్సీ మోర్చా జాతీయ ఉపాధ్యక్షులు ఎస్.కుమార్ లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

Bandi Sanjay వ్యాఖ్యలు:

• టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ విషయంలో తెలంగాణలోని లక్షలాది యువత తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై ప్రజాస్వామ్యబద్దంగా ఆందోళన చేస్తున్న బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశ్ తోపాటు కార్యకర్తలపై లాఠీఛార్జ్ చేసి… జైలుకు పంపడం దుర్మార్గమని అన్నారు. లీకేజీపై ప్రశ్నించడమే వారు చేసిన తప్పా.. ఏడుగురు కార్యకర్తలను జైల్లో వేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

• లీకేజీ నేరస్తులకు రాచ మర్యాదలు చేస్తున్నరు. రాజు నేత అనే కార్యకర్తకు పసిపిల్లలున్నరు. వాళ్ల ఆలనాపాలనా చూసుకోవాలి… ఆయన తప్పు చేయకపోయినా ఆందోళనలో పాల్గొన్నందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అన్యాయం. జైళ్లు, కేసులు బీజేవైఎంకు, బీజేపీకి కొత్త కాదు…

• అసలు పేపర్ లీకేజీ ఎట్లా అయ్యంది? టీఎస్పీఎస్సీ ఛైర్మన్ కు తెలియకుండా ఎట్లా లీకైంది? ముందు వాళ్లను ప్రాసిక్యూట్ చేయాలి. నేరస్తులను కాపాడుకునేందుకే సిట్ వేశారు. మియాపూర్ భూములు, డ్రగ్స్, నయీం కేసులపై వేసిన సిట్ లు ఏమయ్యాయి? కేసీఆర్ సిట్ అంటే సిట్…. స్టాండ్ అంటే స్టాండే.

• కేసీఆర్ ఫ్యామిలీ తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి అభ్యంతరమేంది? ఇదంతా కేసీఆర్ కొడుకు ఆడుతున్న డ్రామా? ‌

• ఈ మొత్తం వ్యవహారంలో కేసీఆర్ కొడుకు పాత్ర క్లియర్ గా ఉంది. ఎందుకంటే ఐటీశాఖ ఫెయిల్యూర్ ఉంది. అయినా కేసీఆర్ ఏమీ మాట్లాడటం లేదు. కొడుకును కాపాడుకునే ప్రయత్నంలో భాగంగానే కొత్త డ్రామా చేస్తున్నడు.. బీజేపీ పాత్ర ఉందని సిగ్గు లేకుండా ఆరోపిస్తున్నారు.. రాజశేఖర్ అనే వ్యక్తి బీజేపీ నాయకుడని అంటున్నారు… 2017 నుండి అతను తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ ఉద్యోగి. ఐటీశాఖ పరిధిలో ఉంటుంది. మరి ఇన్నాళ్లు ఏం చేస్తున్నట్లు? అట్లాంటివాళ్లను గుర్తించడం చేతగాని నువ్వు మంత్రిగా ఉండటానికే అనర్హులు.

• నన్ను రోజూ వెయ్యి మంది వచ్చి సెల్ఫీలు తీసుకుంటారు. వాళ్లందరితో నాకు సంబంధం ఉన్నట్లా? మీకు బయటకు రావడం చేతగాదు.. ప్రజలను కలవడం చేతగాదు.. మీదంతా దొంగ సారా, పత్తాల దందా.

• రేణుక అమ్మ బీఆర్ఎస్ సర్పంచ్.. వాళ్ల అన్న బీఆర్ఎస్ నాయకుడు. ఆ కుటుంబం అంతా బీఆర్ఎస్సే… మరి పేపర్ లీకేజీ ఎవరి కోసం అయ్యింది? బీజేపీపై మొరిగే కుక్కలంతా ఏం సమాధానం చెబుతారు?

• బీజేపీ లీక్ చేశారని చెబుతున్న వాళ్లంతా ఎందుకు ఆధారాలు చూపడం లేదు? రేణుకకు గురుకులం స్కూళ్లో ఉద్యోగం ఇచ్చారు? ఆమె కోసమే పేపర్ లీక్ చేసిన విషయం బహిర్గతమైంది?

• పరీక్షలు కూడా నిర్వహించలేని చేతగానితనం కేసీఆర్ సర్కార్ ది. కనీసం టెన్త్, ఇంటర్ పరీక్షలను కూడా సక్రమంగా నిర్వహించడం చేతగావడం లేదు. దొంగ నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.

• ఐటీ శాఖ కేసీఆర్ కొడుకు వద్దే ఉంది. దీనికి బాధ్యుడు ఆయనే. మరి ఆయనను బర్త్ రఫ్ చేస్తారా? ఆయనను లోపలేసి తొక్కుతారా? తప్పు ఎవరు చేసినా… చివరకు నా కొడుకు, బిడ్డనైనా ఊరుకునేది లేదని అసెంబ్లీ లో కేసీఆర్ చెప్పారు కదా… మరి ఇప్పుడేం చేస్తావ్? నీ కొడుకు రాజీనామా చేయాల్సిందే.. చేసేదాకా వదిలిపెట్టే ప్రసక్తే లేదు.

• బీఆర్ఎస్ లో కేసీఆర్ కుటుంబానికి ఒక రూల్… మిగిలిన వాళ్లకు ఒక రూలా? ఆ పార్టీ నేతలంతా ఆలోచించాలి. చిన్న తప్పు జరిగితే బలి చేసిన కేసీఆర్ ఆయన కొడుకును ఎందుకు బర్త్ రఫ్ చేయరో ప్రశ్నించాలి.

• తక్షణమే జరిగిన పరిణామాలకు బాధ్యులైన వారందరిపై చర్యలు తీసుకోవాలి. ఛైర్మన్ ను తొలగించాలి. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు నిర్వహించి.

• నిరుద్యోగులంతా మీ నిర్వాకంవల్ల ఆందోళన పడుతున్నరు. ఉస్మానియాలో ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా… భేషరతుగా వారిని విడుదల చేయాలి. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు.

Read Also:  పేపర్ లీకేజీ వ్యవహారంపై పీడీఎస్యూ ఆందోళన

Follow us on:   Youtube   Instagram

Latest Articles

ఏఐసీసీ నూతన కార్యాలయం ప్రారంభం.. ఇక ఇందిరాగాంధీ భవన్‌

ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ నూతన కేంద్ర కార్యాలయాన్ని అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రారంభించారు. ఈ కొత్త భవనానికి ఇందిరాగాంధీ భవన్‌ అని పేరు పెట్టారు. 5 అంతస్తుల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్