ఆంధ్రప్రదేశ్: మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి అధికార వైసీపీ గట్టి షాక్ ఇచ్చారు. బాలినేని తీసుకున్న షాకింగ్ నిర్ణయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న బాలినేని.. తాజాగా రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ప్రస్తుతం చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్గా బాలినేని వ్యవహారిస్తున్నారు. వైసీపీ అధిష్టానంపై అసంతృప్తితో ఉన్న బాలినేని.. ఆ బాధ్యతల నుండి తప్పుకుంటున్నట్లు తెలిపారు. ప్రస్తుతం బాలినేని స్వల్ప అస్వస్థతో హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తోంది.