18.7 C
Hyderabad
Friday, February 6, 2026
spot_img

ఏపీలో కొనసాగుతున్న కూటమి హవా

     ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ కూటమి జోరు కొనసాగుతోంది. కూటమి అభ్యర్థులు స్పష్ట మైన ఆధిక్యాలతో దూసుకుపోతున్నారు. మేజిక్‌ ఫిగర్‌ను కూటమి దాటేసింది. ఇప్పటివరకూ టీడీపీ కూటమి 155 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. వైసీపీ ప్రస్తుతం 18 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో కొనసాగుతోంది. కృష్ణా, గుంటూరు జిల్లా్ల్లో టీడీపీ కూటమి క్లీన్‌ స్వీప్‌ చేసింది. వైసీపీ ఒక్క స్థానంలో కూడా ఖాతా తెరవలేదు. జగన్‌, బొత్స మినహా మంత్రులందరూ ఓటమి బాటలో కొనసాగుతున్నారు. ఏపీలో పలువురు మంత్రులు వెనుకంజలో ఉన్నారు. వెనుకబడిన వారిలో రోజా, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల్, అంబటి రాంబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జోగి రమేష్, ఉషశ్రీ చరణ్, ధర్మాన ప్రసాదరావు, దాడిశెట్టి రాజా, బొత్స సత్యనారాయణ, కాకాణి గోవర్థన్ రెడ్డి, తానేటి వనిత, గుడివాడ అమర్ నాథ్ సహా దాదాపుగా అందరు మంత్రులు వెనుకంజలో ఉన్నారు.

    ఏపీలో ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పలు చోట్ల టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు, రాజమహేంద్రవరం రూరల్‌లో గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంగళగిరిలో నారా లోకేశ్‌, పూతల పట్టులో మురళీమోహన్‌ ముందంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ ముగిసేసరికి చంద్రబాబుకు 1,594 బుచ్చయ్య చౌదరి 910 ఓట్ల ఆధిక్యం లభించింది.నగరిలో వైసీపీ అభ్యర్థి మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. తొలి రౌండ్‌ముగిసేసరికి గురజాల టీడీపీ అభ్యర్థి యరపతి నేని 1311 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గాజువాక టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస రావు ఆధిక్యం ఉన్నారు. అమలాపురం టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు ముందంజలో కొనసాగు తున్నారు. మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్‌కు తొలి రౌండ్‌లో 1034 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బాపట్లలో తొలి రౌండ్‌ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ 1394 ఓట్లతో ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్‌ ముగిసే సమయానికి తెనాలి జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్‌కు 7 వేల 885 ఓట్ల ఆధిక్యం కొనసాగుతున్నారు. పెదకూరపాడు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్‌ తొలి రౌండ్‌లో 1500 ఓట్లతో ముందంజలో ఉన్నారు. విజయవాడ పశ్చిమలో బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరికి 2వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.

   జగ్గంపేట అసెంబ్లీ స్థానంలో జ్యోతుల నెహ్రూ, రాజమహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి వాసు, తిరువూరులో కొలికపూడి శ్రీనివాస్‌, చిత్తూరులో గురజాల జగన్‌మోహన్‌కు లీడ్‌ వచ్చింది. పొన్నూరులో ధూళిపాళ్ల నరేంద్ర, విజయవాడ సెంట్రల్‌లో బొండా ఉమా, బొబ్బిలిలో సుజయకృష్ణ రంగారావు, ఒంగోలులో దామ చర్ల జనార్దన్‌, గుడివాడలో వెనిగండ్ల రాము, ఉండిలో రఘురామకృష్ణరాజు, గురజాలలో యరపతినేని శ్రీనివాస్‌, పాణ్యంలో గౌరు చరితారెడ్డి, పెనుకొండలో సవిత, మాచర్లలో జూలకంటి బ్రహ్మారెడ్డి ఆధిక్యంలో కొనసాగుతున్నారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడుకు లీడ్‌ వచ్చింది. రెండో రౌండ్‌ ముగిసేసరికి బుచ్చయ్య చౌదరి ఆధిక్యం 2 వేల 870కు పెరిగింది. ఏపీలో తొలి ఫలితం వెల్లడిం చారు. రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి గెలుపొందారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్