27.2 C
Hyderabad
Sunday, December 22, 2024
spot_img

జులై 14న ప్రేక్షకుల ముందుకి రాబోతున్న బేబీ..

స్వతంత్ర వెబ్ డెస్క్: ఆనంద్ దేవరకొండ హీరోగా షార్ట్ ఫిలిమ్స్ తో గుర్తింపు తెచ్చుకున్న వైష్ణవి చైతన్య లీడ్ రోల్ లో తెరకెక్కిన సినిమా బేబీ. ఈ చిత్రంలో విరాజ్ మరో హీరోగా ఉన్నాడు. కలర్ ఫోటో లాంటి నేషనల్ అవార్డ్ సినిమాను ప్రొడ్యూస్ చేసిన సాయి రాజేష్ దర్శకత్వంలో బేబీ అనే సినిమా రాబోతోంది. ఇక ఈ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ ఇప్పటికే సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఎస్.కే.ఎన్ నిర్మించిన బేబీ సినిమా జూలై 14న విడుదల కాబోతోంది. ఈ మూవీ ట్రైలర్‌ విడుదలైంది..

ఈ ట్రైలర్ లో హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ చుట్టూనే కథ తిరుగుతుందని స్పష్టం అవుతోంది. స్కూల్ వయస్సులో ఉన్నప్పుడు కాస్తా నల్లగా ఉండే అమ్మాయిని హీరో ప్రేమిస్తాడు. అయితే చదువుల్లో రాణించలేకపోవడంతో ఆనంద్ ఊరిలోనే ఉండిపోతాడు. ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయిన బేబీ కాలేజీ స్టడీస్ కోసం సిటీకి వెళ్తుంది. అక్కడ లైఫ్ స్టైల్ కొత్త కొత్త పరిచయాలతో తన లుక్ క్యారెక్టర్ అన్ని మారిపోతాయి. కాలేజీ లో విరాజ్ తో ఆమెకి పరిచయం ఏర్పడుతుంది. ఆ తరువాత ప్రేమకథలో వేరియేషన్స్ స్టార్ట్ అవుతాయి. తను లుక్ పరంగా అందంగా మారిపోవడంతో పాటు ఆహార్యం కూడా మారడంతో ఆనంద్ దేవరకొండకి డౌట్స్ వస్తాయి. ఫ్రెండ్ గా ఉన్నందుకే విరాజ్ ఆమెని ప్రేమిస్తాడు. అలా ఇద్దరి ప్రేమల మధ్య నలిగిపోయే ఓ అమ్మాయిగా వైష్ణవి చైతన్య పాత్ర ఉంది. ట్రైలర్ చూసుకుంటే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. కంటెంట్ ని కరెక్ట్ గా ఎలివేట్ చేస్తూ మ్యూజిక్ అందించారు. ఇక డైలాగ్స్ కూడా ఇంటెన్సన్ ని క్రియేట్ చేసే విధంగా ఉండటం విశేషం. ప్రమాదం జరిగినపుడు ముందే అలెర్ట్ చేసే దేవుడు ఇప్పుడు అందుకు చేయలేదు అంటూ ఆనంద్ దేవరకొండ చెప్పే డైలాగ్ లవ్ ఫెయిల్యూర్ లో పెయిన్ ని చూపిస్తుంది.

మీరు బలవంతులు కావచ్చు. ఎంత గట్టిగా అయిన కొట్టొచ్చు… గుండెల మీద కొట్టాలంటే మా కంటే గట్టిగా ఎవరూ కొట్టలేరు అంటూ అమ్మాయి డ్రింక్ చేస్తూ చెప్పే డైలాగ్ కూడా ప్రేమ పేరుతో అమ్మాయిలూ చేసే మోసాన్ని ఎలివేట్ చేసే విధంగా. హృదయ కాలేయం కొబ్బరిమట్ట లాంటి సెటైరికల్ సినిమాలు చేసిన సాయి రాజేష్ నుంచి మొదటిసారి ఫీల్ గుడ్ లవ్ స్టొరీతో జెన్యూన్ మూవీగా బేబీ రావడం విశేషం. మరి ఈ చిత్రం అతనికి ఏ మేరకు సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.

ఈ సందర్భంగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘ఎస్‌కేఎన్ జర్నీ చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత మంచి ట్రైలర్‌ను చూపించాడు. మారుతిని చూసినప్పుడల్లా ఓ ధైర్యం కనిపిస్తుంది. బన్నీ వాసు వల్ల ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యం అవుతుంది. బేబీ తరువాత సాయి రాజేష్‌ను ఎక్కువగా సెలెబ్రేట్ చేసుకుంటారు. జూలై 14న టీం అంతా కూడా పండుగ చేసుకునేలా ఉంటుంది’ని అన్నారు.

Latest Articles

డైరెక్టర్ రామ్‌ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్ నెట్ షాక్

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌ నెట్ షాక్ ఇచ్చింది. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన వ్యూహం సినిమాకు లీగల్ నోటీసులు పంపింది. ఏపీ ఫైబర్ నెట్.. వ్యూహం సినిమాకు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్