ఏపీ సీఎం చంద్రబాబు నాయడు నేడు బిజీబిజీగా గడపనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై ఆయన రివ్యూ చేయనున్నారు. అనంతరం బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై కూడా సమీక్షలు నిర్వహించనున్నారు. భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలకు అందించే సాయంపై ఇవాళ సాయంత్రం ముఖ్యమంత్రి ప్రకటన చేయనున్నారు. నూతన ఎక్సైజ్ పాలసీపై సీఎం చంద్రబాబు జరపనున్న సమీక్షలో మంత్రి కొల్లు రవీంద్ర, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. అనంతరం బీసీ వెల్ఫేర్, హ్యాండ్లూమ్స్, టెక్స్ టైల్స్ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహిస్తారు. ఈ సమీక్షకు మంత్రి ఎస్ సవిత, సంబంధిత శాఖ ఉన్నతాధికారులు హాజరవుతారు.