హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి, ప్రధాన అనుచరుడు ఉదయ్ కుమార్ రెడ్డిల విచారణ ముగిసింది. దాదాపు ఆరు గంటల పాటు వీరు ముగ్గురిని కలిపి అధికారులు విచారించారు. వివేకా హత్య కేసులో రూ.40కోట్ల డీల్ జరిగిందన్న ఆరోపణలపై వారిని ప్రశ్నించారు. నిందితుడు సునీల్ యాదవ్ కు రూ.కోటి ఎవరు బదిలీ చేశారని ఆరా తీశారు. అలాగే హత్య జరిగిన రోజు నిందితులు మీ ఇంట్లో ఎందుకు ఉన్నారని కూడా విచారించినట్లు తెలుస్తోంది. విచారణ అనంతరం భాస్కరరెడ్డి, ఉదయ్ లను చంచల్ గూడ జైలుకు తరలించారు. భాస్కరరెడ్డికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో జైలులో చికిత్స అందించనున్నారు. తిరిగి రేపు ఉదయం 10.30గంటలకు మళ్లీ వీరిని విచారించనున్నారు.


