నిర్మల్ జిల్లా బాసరలోని శారదానగర్ కాలనీకి చెందిన ఆటో డ్రైవర్లు ఒకరిపై ఒకరు కత్తులతో దాడులకు పాల్పడ్డారు. అనీస్‌పై అదే కాలనీకి చెందిన మరో ఆటో డ్రైవర్ అర్బస్ నిన్న కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో అనీస్‌కు గాయాలయ్యాయి. ఇద్దరి మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. కోపంతో అనీ స్‌పై అర్బస్ కత్తితో దాడి చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.