చిత్తూరు జిల్లాలో వైసీపీ నేతల బెదిరింపుల ఆడియో నెట్టింట వైరల్ అవుతోంది. టీడీపీ నేతలను చంపాలన్న వైసీపీ కార్యకర్త మహేష్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు తెలుగు తమ్ముళ్లు. లక్ష్మీపురానికి చెందిన టీడీపీ లీడర్ బాలును చంపేస్తామంటూ బెదిరించాడు వైసీపీ కార్యకర్త మహేష్. ఎవరినో ఒకరిని చంపితే కానీ కసి తీరదంటూ మాట్లాడిన మహేష్ ఆడియో బయటకు రావడంతో మండిపడుతున్నారు టీడీపీ శ్రేణులు. వైసీపీ నుంచి తమకు రక్షణ కల్పించా లని పోలీసులను కోరుతున్నారు.


