జగన్ ప్రభుత్వంలో దళితులపై అనేక దాడులు జరిగాయని దళితనేత, జనసేన నాయకుడు వర్ధనపు ప్రసాద్ మండిప డ్డారు. పేర్ని నాని, కొడాలి నాని వ్యాఖ్యలు దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉన్నాయని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో మీడియాతో ఆయన మాట్లాడారు. టిడిపి, జనసేన, బిజెపి నాయకులు, కార్యకర్తలపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలోనే దళితులకు రక్షణ లేకుండా పోయిందని,అప్పుడు నోరు మెదపని వైసీపీ నాయకులు ఇప్పుడు మాట్లాడడం హాస్యాస్పదం అన్నారు. అందుకే రాష్ట్ర ప్రజలు విజ్ఞతతో ఆలోచించి కూటమికి పట్టం కట్టారని ప్రసాద్ అన్నారు.