వైసీపీ శ్రేణులపై టీడీపీ నాయులు దాడులు చేయడం, కక్షసాధింపు చర్యలకు దిగడం మంచిది కాదని విజయనగరం జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అన్నారు. జిల్లాలో తాము ఎప్పుడూ హింసను ప్రోత్సహిం చలేదని చెప్పారు. కొత్తవలస మండలం ఉత్తరాపల్లి సచివాలయంపై కొందరు కూటమి కార్యకర్తలు రాళ్లు వేయడం, శిలాఫలకాలు పాడుచేయడం, ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం తగదన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందే, విధివిధినాలు చెప్పక మునుపే ఇలా దాడులు చేయడం అప్రజాస్వామికం అని మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.


