స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: రోజురోజుకు దారుణాలు పెరిగిపోతున్నాయి. అప్పుల బాధతో కొందరు, అక్రమ సంబంధాలతో కొందరు, భార్యాభర్తల మధ్య సఖ్యత లేక మరొకొందరు.. ఇలా అనేక కారణాల చేత హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రీసెంట్ గా హైదరాబాద్ శివారు గ్రామం జన్వాడలో దారుణం జరిగింది. భార్యను చంపి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు ఓ ఆర్‌ఎంపీ డాక్టర్. ఇద్దరు చిన్నారుల ముందే హత్య, ఆత్మహత్య జరగటం స్థానికంగా కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు కళ్ళముందే చనిపోవడంతో ఇద్దరు చిన్నారులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. భార్యాభర్తల మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతుల వివరాలు తెలియరాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, దారుణం జరగటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.