అల్లూరు జిల్లా చింతూరు ఏజెన్సీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. చత్తీస్‌ఘడ్ నుంచి బ్రతుకుతెరువు కోసం పదేళ్ల క్రితం ఒక కుటుంబం గౌరిదేవిపేట గ్రామానికి వచ్చింది. ఆ గ్రామంలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆ కుటుంబంలో ఒక నాలుగేళ్ల చిన్నారి ఉంటుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో అదే గ్రామానికి చెందిన రాము చిన్నారికి చాక్లెట్ ఆశ చూపి ఇంట్లోకి పిలిచి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రెండు రోజుల నుంచి నలతగా ఉండడంతో చిన్నారిని తల్లి అడగడంతో చిన్నారి అసలు విషయం బయటపెట్టింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు నిందితుడు రాముపై పోక్సో కేసు నమోదు చేశారు.