21.6 C
Hyderabad
Sunday, September 28, 2025
spot_img

రంగారెడ్డి జిల్లాలో దారుణం.. కాలిపోయిన శరీరంతో రోడ్డుపై మహిళ

రంగారెడ్డి(Ranga Reddy ) జిల్లా రాజేంద్రనగర్‌లో కాలిన గాయాలతో ఓ మహిళ కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 133 వద్ద ఓ మహిళ తీవ్రంగా కాలిపోయి అవస్థలు పడుతుండగా స్థానికులు గమనించారు. వెంటనే రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని గాయాలతో కాలిపోయి ఉన్న ఆ మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు.. బాధితురాలు అత్తాపూర్ కు చెందిన శివానిగా గుర్తించారు. అయితే ఈ ఘటన గురించి ఆమెను ఆరా తీయగా.. తన భర్తే తగులబెట్టాడని చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిజంగా భర్తే తగలబెట్టాడా? లేదా తనకు తానే తగలబెట్టుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా? అన్న కోణంలో విచారణ చేస్తున్నారు.

Read Also: రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు రానున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం
Follow us on:  Youtube, Instagram, Google News

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్