స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో శనివారం ఉద్రిక్తత నెలకొంది. వైద్యుల నిర్లక్ష్యంతో మూడు నెలల బాలింత మహేశ్వరి మృతి చెందింది. ఆసుపత్రి సూపరింటెండెంట్‌పై మహేశ్వరి కుటుంబీకులు, స్థానిక ప్రజలు దాడికి యత్నం చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఆసుపత్రి సిబ్బందిపై మృతురాలి బంధువులు దురుసుగా ప్రవర్తించారు. ఆసుపత్రి నిర్వాకం వల్లే నిండు ప్రాణం బలియైనదని వారు తమ దుఃఖాన్ని వెల్లడించారు. తమకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.