స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: ఓ వైపు మణిపూర్ తగలబడుతూ.. జమ్మూకశ్మీర్ లో సైనికులు చనిపోతుంటే.. ప్రధాని మోదీ మాత్రం కర్ణాటకలో రోడ్ షోలు నిర్వహిస్తున్నారని MIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ విమర్శించారు. ఉగ్రవాదులు భారత సైనికులను చంపుతున్నారని.. ఐదుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారన్నారు. అలాగే మణిపూర్‌లో చెలరేగిన హింసతో ప్రజలు ఇళ్లు వదిలి పారిపోతున్నారంటే ప్రధాని మాత్రం కేరళ స్టోరీ సినిమా గురించి మాట్లాడటం విచారకరమని ఒవైసీ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఎన్నికల్లో గెలవడానికి అసత్యాలు, తప్పుడు ప్రచారాలతో తీసిన సినిమాను ఆశ్రయించాల్సి వచ్చిందంటూ ప్రధాని మోదీ మాట్లాడుతున్న వీడియోను ట్వీట్ చేశారు.
Ek Election jeetne ke liye PM @narendramodi ko Jhoot aur Propaganda par mabni Movie 'The Kerala Story' ka Sahara lena pad raha haipic.twitter.com/ikSfGpgxIx
— Asaduddin Owaisi (@asadowaisi) May 6, 2023