ఖమ్మం లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కౌటింగ్ జరుగుతున్న శ్రీచైతన్య కాలేజీ వద్ద మూడంచెల పోలీసు భద్రత ఏర్పాటు చేశారు. 250 మంది పోలీస్ సిబ్బందితోపాటు మూడు స్పెషల్ పార్టీలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కళాశాల ప్రాంతంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌లతో తనీఖీలు చేయను న్నారు. జిల్లాలో ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వివిధ ప్రాంతాల్లో పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎన్నికల కమీషన్ జారీ చేసిన పాసులున్న వారిని మాత్రమే అనుమతించనుంది.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్‌ను ఒకే టేబుల్‌పై లెక్కించనున్నారు. 1,896 పోలింగ్ కేంద్రాలకు సంభందించి ఈవీఎంలను 115 టేబుళ్ల ద్వారా కౌంటింగ్ చెయ్యబోతున్నారు. ప్రతి టేబుల్ కు మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ సూపర్‌వైజర్, అసి స్టెంట్ సూపర్‌వైజర్‌లు కూడా ఉండనున్నారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో 18 టేబుళ్లను ఏర్పా టు చేశారు. సాయంత్రం 3 నుండి 4 గంటల వరకు కౌంటింగ్ ప్రక్రియ పూర్తి చెయ్యాలని జిల్లా అధి కారు లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఉదయం 5 గంటలకే స్ట్రాంగ్‌రూమ్‌ను అభ్యర్ధులు లేదా వారి ఏజెంట్ల సమక్షంలో తెరవనున్నారు. ఉదయం 5 గంటలకంతా కౌంటింగ్ విధుల్లో ఉండే అధికారులు, సిబ్బంది చేరుకోవాల్సి ఉంటుంది. మొత్తం కౌంటింగ్‌లో 600 మంది సిబ్బంది పాల్గొననున్నారు. వీరితో పాటు మరో 600 మంది సహాయక సిబ్బంది, 250 మంది పోలిస్ సిబ్బందిని నియమించారు. మొత్తం 1,500 మంది కౌటింగ్ విధుల్లో పాల్గొననున్నారు.
రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్దులు మొత్తం 36 మంది ఎన్నికల బరిలో నిలిచారు. వీరి తరుపున కౌటింగ్‌కు 565 మంది ఏజెంట్లు హాజరవుతుండడంతో వారందరి వ్యక్తిగత సమాచారం తీసుకున్నారు అధికారులు. ఏజెంట్లకు గుర్తింపు కార్డులు ఇప్పటికే జారీ చేశారు. ఉదయం 6గంటల వరకు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుంది. ఈసీ అనుమతి పొందిన వారు మినహా మిగిలిన కౌంటింగ్ ఏజెంట్లు, ఉద్యోగులు ఎవరికి కౌంటింగ్ హల్‌లో సెల్‌ఫోన్ అనుమతి లేదని ఆదేశాలు జారీ చేశారు.