స్వతంత్ర వెబ్ డెస్క్: ఉండవల్లి కరకట్ట వద్ద ఉన్న లింగమనేని రమేష్ ఇంటి జప్తునకు అనుమతి కోరుతూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విజయవాడ ఏసీబీ కోర్టు విచారణ జరిపింది. సీఐడీ ఎస్పీ జయరాజును లింగమనేని ఇంటి ఎటాచ్‌మెంట్‌కు సంబంధించిన వివరాలను.. కేసు విచారణ అధికారి పూర్తి వివరాలతో డాక్యుమెంట్లు సమర్పించారు. ఇరు వైపులా వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు రిజర్వు చేసింది. ఈనెల 28న ఉత్తర్వులు ఇస్తామని న్యాయస్థానం తెలిపింది.