కేజ్రీవాల్ సీబీఐ అరెస్టుపై ట్రయల్ కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్‌ను ఎందుకు అరెస్టు చేయాల్సి వచ్చిందో సీబీఐ వివరణ ఇచ్చింది. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ కీలకమని, ఆయన్ని ప్రశ్నించాల్సి ఉందని సీబీఐ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ నివాసంలోనే కొత్త మద్యం పాలసీ తయారైందని చెప్పారు. కేజ్రీవాల్ గోవా పర్యటనకు నగదును హవాల మార్గంలో సమకూర్చారన్నారు. సౌత్ లాబీకి కేజ్రీవాల్ పూర్తిగా సహకరించారన్నారు. సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్ మధ్య సమావేశాన్ని ఏర్పాటు చేశారన్నారు. 338 కోట్ల నగదు చేతులు మారినట్టు ఆధారాలు ఉన్నాయని తెలిపారు. విచారణ సమయంలో కేజ్రీవాల్ షుగర్ లెవల్స్ పడిపోయాయి. టీ, బిస్కెట్లు కావాలని కేజ్రీవాల్ కోరారు. కోర్టు అనుమతితో సీబీఐ అధికారులు కేజ్రీవాల్‌ను మరో గదిలోకి తీసుకెళ్లారు. కేజ్రీవాల్‌ను సీబీఐ ఐదు రోజుల కస్టడీ కోరింది.


