Headche | దైనందిన జీవితంలో అనేక సమస్యలతో సతమతమౌతుంటాం. ఉద్యోగ, వ్యాపార, సామాజిక, ఆర్థిక, కుటుంబ ఇలా అనేక సమస్యలు రోజు వస్తుంటాయి. వీటిగురించి మనం అతిగా ఆలోచించడం వల్ల అనేక సమస్యలుఎదురవుతుంటాయి. ముఖ్యంగా తలనొప్పి నిద్రలేకుండా చేసి.. మనసులో అల్లకల్లోలం సృష్టిస్తుంది. హైదరాబాద్ లాంటి మహానగరాల్లో నివసిస్తున్నప్పుడు.. వాహన కాలుష్యం, శబ్ద కాలుష్యం, గాలి కాలుష్యం వల్ల నిద్రలేమి సమస్య ఎదురవుతుంది. అలాగే అతిగా ఆలోచించడం వల్ల మెదడుకి రెస్ట్ దొరకకుండా అలసిపోతుంది. మెదడుకి రక్త ప్రసరణ తగ్గి తద్వారా తలనొప్పికి దారితీస్తుంది.
అసలు తలనొప్పి రావడానికి గల ప్రధాన సమస్య ముక్కు. ముక్కు సాఫీగా పనిచేయకపోవడం వల్ల తలనొప్పికి దారితీస్తుంది. కొందరికి సైనస్, ఆస్తమా, అలర్జీ కారణంగా ముక్కులు బ్లాక్ అవుతుంటాయి. ఈ సమయంలో శ్వాస తీసుకోవడం కష్టతరం అవుతుంది. తద్వారా నిద్ర చెడిపోతుంది. నిద్రలేమి కారణంగా తలనొప్పి ఏర్పడుతుంది. తలనొప్పిని తగ్గించుకోవడంటే.. ముందుగా శ్వాసపై ద్రుష్టి పెట్టాలి. ముక్కుతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురైన వారు ముందుగా వేడి నీటిని ఎక్కువగా తీసుకోవాలి. దీని ద్వారా ముక్కు శ్వాస కోశాలు సడలించి.. శ్వాస ఫ్రీ గా తీసుకునేలా చేస్తుంది. అలాగే కఫము పెరగటానికి అతిపెద్ద కారణం.. ఉప్పు. రోజు తినే ఆహారంలో ఉప్పును అధికంగా వాడటం వలన అది కఫముగా మారుతుంది. దీని ద్వారా శ్వాస నాళాలు ముడుచుకు పోతాయి. ఉప్పును తగ్గించడం వలన కఫ సమస్యలు తగ్గిపోతాయి.
అలాగే ప్రతిరోజు కాస్త సమయాన్ని కేటాయించి గార్డెన్ లో గడపండి. పూల మొక్కలనుండి వచ్చే పువ్వులు, ఆకుల యొక్క వాసనలు పీల్చుకోవడం వలన మనసుకు ప్రశాంతంగా కలుగుతుంది. అందువల్ల మానసిక శక్తి కాస్త కుడుతపడుతుంది. ప్రతిరోజు ప్రాణాయామం, సూర్యనమస్కారాలు, వాకింగ్, జాగింగ్ లాంటివి చేస్తే.. మనసు శాంతి పొందుతుంది అలాగే మీరు నచ్చిన పని రోజు చేయండి. పచ్చటి ప్రకృతి నడుమ సంగీతాన్ని ఆస్వాదించండి. మీకు ఇష్టమైన ఆహారాన్ని మీరే వండుకొని తినండి. దైవారాధన వల్ల కూడా మనసుకు ప్రశాంతత కలుగుతుంది. భార్యాభర్తలు ఇరువురు కూడా శృంగారాన్ని ఆస్వాదించండి. తలనొప్పిని తగ్గించడానికి శృంగారం తోడ్పడుతుంది.
వీటితో పాటుగా చిన్న వంటింటి చిట్కాలను కూడా పాటించండి. గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. ఒకోసారి కడుపులో గ్యాస్ చేరడం వల్ల కూడా తలనొప్పి వస్తుంది. అందుకే భోజనాన్ని సరైన సమయంలో మాత్రమే తినాలి. సమయపాలన లేకుండా తినకూడదు. తరచుగా భోజనంలో నెయ్యిని చేర్చుకుంటే తలనొప్పి వంటి సమస్యలు తగ్గుతాయి. వెల్లుల్లి రసాన్ని తీసుకుంటే తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఒక గ్లాస్ మంచి నీటిలో ధనియాలు, చక్కెర కలుకుని తీసుకుంటే తలనొప్పి తగ్గుతుంది. గంధపు చెక్కపై నీళ్ల చుక్క వేసి రాయి మీద రుద్దుకుని ఆ మిశ్రమాన్ని నుదిటికి రాసుకుంటే తలనొప్పి పూర్తిగా తగ్గుతుంది.