స్వతంత్ర వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) గ్రూప్-1 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీపీఎస్సీ ఛైర్మన్ గౌతమ్ సవాంగ్(Gautam Sawang) గురువారం సాయంత్రం ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్వ్యూల అనంతరం ఉద్యోగాలకు ఎంపికైన వారి జాబితాను ఏపీపీఎస్సీ వెల్లడించింది. మొత్తం 111 గ్రూప్-1(Group-1) ఉద్యోగాలకు గాను 259 మందిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేశారు. వీరిలో 39 మందిని స్పోర్ట్స్ కోటాలో(Sports Quota) ఎంపిక చేశారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2 నుంచి ఇంటర్వ్యూలు నిర్వహించారు. మొత్తం 16 విభాగాల్లో 110 పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేశారు. స్పోర్ట్సు కోటాలో ఒక పోస్టు నియామకంపై త్వరలో ప్రకటిస్తామని ఏపీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు.