వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి సంచలన వ్యాఖ్యలు చేశారు. చావ డానికైనా సిద్ధమే గానీ.. సీఎం జగన్, ఎంపీ అవినాష్‌రెడ్డిల బెదిరింపులకు తలొగ్గేది లేదని ఆయన స్పష్టం చేశారు. పులివెందులలో ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంటి పక్కనే తాను నివాసం ఉంటానని, ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. వివేకా హత్యకు సంబంధించి తప్పుచేసి ప్రాయశ్చిత్తంతో అప్రూవర్ గా మారానని, ఇప్పుడు సీఎం, ఎంపీల మాటలు విని మళ్లీ తప్పు చేయనని చెప్పారు. వివేకా కేసులో అప్రూవర్‌గా ఉన్నాననే ఉద్దేశంతోనే కుట్ర పన్ని, తనను కేసుల్లో ఇరికించారని ఆరోపించారు.


