స్వతంత్ర, వెబ్ డెస్క్: వైసీపీ ప్రభుత్వంపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీనడ్డా పలు విమర్శలు చేశారు. ఏపీ సర్కారు అవినీతిలో కూరుకుపోయిందని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ కుంభకోణం, లిక్కర్ స్కామ్ జరుగుతోందని ఫైర్ అయ్యారు. ఏపీలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని మండిపడ్డారు. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ నిలిచిందన్న జేపీనడ్డా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా లోపించాయని అన్నారు. జగన్ ప్రభుత్వం పాలనను గాలికి వదిలేసిందన్నారు. అనేక ప్రాజెక్టులకు రాష్ట్ర వాటా ఇవ్వడం లేదని అన్నారు. దీంతో పనులన్నీ నిలిచిపోయాయని నడ్డా విమర్శించారు.