20.2 C
Hyderabad
Monday, January 20, 2025
spot_img

Purandeshwari: కేంద్రం అందిస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోంది..!

స్వతంత్ర వెబ్ డెస్క్: పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎక్కడా తప్పుకోలేదని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి స్పష్టం చేశారు. నిర్మాణానికి అవుతున్న ప్రతీ పైసా కేంద్రం నుంచే వస్తోందని ఆమె అన్నారు. పునరావాసానికి సంబంధించిన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడం లేదని తెలిపారు. పోలవరం లెక్కలకు సంబంధించి ప్రభుత్వం సవరణ కోరిందని ఆ విషయంలో తాము కూడా త్వరలో కేంద్ర జలశక్తి మంత్రిని కలవనున్నామని పురంధేశ్వరి ప్రకటించారు. కేంద్ర నాయకత్వం ఎక్కడి నుంచి పోటీ చేయమని చెప్తే అక్కడి నుంచి తాను పోటీ చేస్తానని పురంధేశ్వరి తెలిపారు. జనసేనతో పొత్తు కొనసాగుతుందని స్పష్టం చేశారు. మిగిలిన పొత్తులపై కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాలకు అందిస్తున్న నిధులను ఏపీ ప్రభుత్వం దారి మళ్లిస్తోందని పురంధేశ్వరి ఆరోపించారు. పంచాయతీలకు నిధులు అందని పరిస్థితి ఏర్పడిందని అన్నారు. పార్టీలకతీతంగా సర్పంచ్‌లు తమను కలిసి ఆవేదనను వెళ్లబోసుకున్నారని తెలిపారు. రాష్ట్రంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా చెలరేగిపోతోందని పురంధేశ్వరి ఆరోపించారు. 10 లక్షలు, 15 లక్షల రూపాయల పనులు చేసే చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం, రైతులకు నిజంగా ఏం మేలు చేశారని పురంధేశ్వరి ప్రశ్నించారు.

Latest Articles

చందమామకు చెత్త కష్టాలు – అంతరిక్షంలో స్వచ్ఛ చంద్ర చేపట్టాల్సిందేనా..?

చెత్త పెరిగిపోతోంది బాబోయ్, నాయనోయ్...అంటూ గోలెత్తేస్తుంటే, క్లీన్ అండ్ గ్రీన్, హరిత హారం, శుభ్రతా, పరిశుభ్రతా, స్వచ్ఛ భారత్...ఇలా ఎన్నో విషయాలు చెప్పి, బుజ్జగించి, లాలించి ఆ చెత్తకు చెక్ పెట్టే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్