ఏపీ సీఎం జగన్ కాలికి గాయమైందని సీఎంవో కార్యాలయం ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. ప్రతిరోజు లాగే ఇవాళ ఉదయం కూడా వ్యాయమం చేస్తుండగా జగన్ కాలు బెణికిందని తెలిపింది. సాయంత్రానికి గాయం తీవ్రత ఎక్కువ కావడంతో పరీక్షించిన వైద్యులు కొన్ని రోజులు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించినట్లు పేర్కొంది. దీంతో రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దు చేసుకున్నట్లు వెల్లడించింది. గతంలో కూడా ఒకసారి ఇలాగే కాలికి గాయం కావడంతో చాలా రోజులు ఇబ్బంది పడ్డారని ట్వీట్ చేసింది. దీంతో వైసీపీ అభిమానులు, నేతలు జగన్ కాలి గాయం నుంచి త్వరగా కోలుకోవాలని ట్వీట్స్ చేస్తున్నారు.
ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్కు కాలినొప్పి*. ఉదయం ఎక్సర్సైజ్ చేస్తున్న సమయంలో బెణికిన కాలు. సాయంత్రానికి పెరిగిన నొప్పి. గతంలో ఇలానే కాలికిగాయం. చాలారోజులపాటు ఇబ్బందిపడ్డ ముఖ్యమంత్రి. ప్రయాణాలు రద్దుచేసుకోవాలని డాక్టర్ల సూచన. రేపటి ఒంటిమిట్ట పర్యటనను రద్దుచేసిన అధికారులు.
— CMO Andhra Pradesh (@AndhraPradeshCM) April 4, 2023


