ఎస్సీ, ఎస్టీ ఉపవర్గీకరణపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఏడుగురు సభ్యులుగా జడ్జిల్లో ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా అభిప్రాయం చెప్పడం అభినందనీయమని అన్నారు. సామాజిక న్యాయం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతమని చెప్పారు. అందరికి న్యాయం జరుగాలనే లక్ష్యంతో 1996-97లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రామచంద్రారావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులు అధ్యయనం చేసిన తరువాత ఏబీసీడీ వర్గీకరణను తీసుకొచ్చానని చెప్పారు.