తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్(టీఎఫ్‌సీసీ) నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భరత్ భూషణ్.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సినీ పరిశ్రమ సమస్యలు, గద్దర్ అవార్డ్స్ గురించి సీఎంతో చర్చించారు.
ఈ సందర్భంగా భరత్ భూషణ్ మాట్లాడుతూ ‘‘ఎంతో బిజీ షెడ్యూల్ ఉండి కూడా కలవడానికి అవకాశం ఇచ్చి ముచ్చటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇండస్ట్రీలో ఉన్న సమస్యల్ని పరిష్కరించడంలో ప్రభుత్వం నుంచి ఎప్పుడూ సహాయం అందుతుందని ఆయన చెప్పడం చాలా ఆనందంగా ఉంది.’’ అని అన్నారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ‘‘తెలుగు ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు భరత్ భూషణ్‌కి అభినందనలు. నా అమెరికా పర్యటన తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలో మీటింగ్ ఏర్పాటు చేసి తెలంగాణ ప్రభుత్వం తరఫు నుంచి ఎలాంటి సపోర్ట్ కావాలన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నాము’’ అని అన్నారు.