కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్, సెజ్‌లోని వాటాల బదలాయింపు వ్యవహారంపై సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మొత్తంగా 3 వేల 600 కోట్ల మేర వాటాలు బలవంతంగా తీసుకున్నారంటూ… బాధితుడు కేవీ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. A1గా వైవీ సుబ్బారెడ్డి కుమారుడు వై. విక్రాంత్‌రెడ్డి, A2గా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి, A3గా విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు పి. శరత్‌చంద్రారెడ్డి ఉన్నారు. మరికొందరిపైనా కేసు నమోదైంది. ఈ మొత్తం వ్యవహారం వెనుక నాటి ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ ఉన్నట్లుగా తనకు అర్థమైందని… బాధితుడు కేవీ రావు సీఐడీకి చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది. వాటాల బదలాయింపు వ్యవహారంపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు ఏపీ పీసీసీ చీఫ్ వై.ఎస్ షర్మిల.