AP CID Notice |ఎన్నికలు దగ్గర పడే కొద్ది ఏపీలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వా నేనా అనే రీతిలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు నేతలు. ఈ క్రమంలో మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి ఏపీ సీఐడీ అధికారులు వెళ్లారు. టీడీపీ అనుబంధ పత్రిక చైతన్యరథంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన కథనాలపై టీడీపీ ప్రధాన కార్యదర్శి పేరుతో నోటీసులు అందజేశారు.
గతేడాది నవంబరు 23న చైతన్యరథం పత్రికలో మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డిపై వచ్చిన ఓ కథనంపై సీఐడీ అధికారులు నోటీసులు(AP CID Notice) అందించినట్లు సమాచారం. సీఐడీ నోటీసులపై టీడీపీ నేతలు స్పందిస్తూ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సీఐడీ అధికారులు నోటీసులు ఇవ్వడానికి వచ్చారని విమర్శించారు. చైతన్యరథనంలో బుగ్గనపై వచ్చిన ఆరోపణలు ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఇలాంటి నోటీసులతో టీడీపీని దెబ్బతీయలేరని పేర్కొన్నారు.