AP Budget |ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్‌ను గురువారం అసెంబ్లీలో ప్రవేశ పెట్టింది. 2023–24 ఆర్థిక ఏడాదికి మొత్తం రూ.2 లక్షల 79వేల 279 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ఇందులో రెవిన్యూ వ్యయం రూ.2,28,540 కోట్లు, మూలధన వ్యయం రూ.31,061 కోట్లు, రెవిన్యూ లోటు రూ.22,316 కోట్లు, ద్రవ్య లోటు రూ.54,587 కోట్లు, జీఎస్డీపీలో రెవిన్యూ లోటు 3.77 శాతం, ఏపీ ద్రవ్యలోటు 1.54 శాతంగా ఉన్నాయి.
AP Budget |2023 బడ్జెట్ కేటాయింపులు..
👉🏼అమ్మ ఒడి రూ.6,500 కోట్లు
👉🏼వైఎస్సార్ పెన్షన్ కానుక- రూ.21,434.72 కోట్లు
👉🏼వైఎస్సార్ రైతు భరోసా రూ.4,020 కోట్లు
👉🏼మొత్తంగా డీబీటీ స్కీంలకు రూ.54,228.36 కోట్లు
👉🏼ధర స్థిరీకరణ నిధి రూ.3,000 కోట్లు
👉🏼వ్యవసాయ యాంత్రీకరణ రూ. 1,212 కోట్లు
👉🏼జగనన్న విద్యాదీవెన రూ.2,841.64 కోట్లు
👉🏼జగనన్న వసతి దీవెన- రూ.2,200 కోట్లు
👉🏼వైఎస్సార్- పీఎం బీమా యోజన- రూ.1600 కోట్లు
👉🏼డ్వాక్రా సంఘాలకు వడ్డీలేని రుణాల కోసం రూ.1,000 కోట్లు
👉🏼రైతులకు వడ్డీలేని రుణాలు రూ.500 కోట్లు
👉🏼వైఎస్సార్ కాపు నేస్తం- రూ. 550 కోట్లు
👉🏼జగనన్న చేదోడు రూ.350 కోట్లు
👉🏼వైఎస్సార్ వాహనమిత్ర రూ.275 కోట్లు
👉🏼వైఎస్సార్ నేతన్న నేస్తం రూ.200 కోట్లు
👉🏼వైఎస్సార్ మత్స్యకార భరోసా రూ.125 కోట్లు
Read Also: శ్రీకాకుళంలో వైసీపీ అభ్యర్థి నర్తు రామారావు గెలుపు
Follow us on: Youtube Instagram