మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు సునీల్ యాద్ తల్లిపై లైంగిక వేధింపుల కారణంగానే ఆయనను హత్య చేశారని వైఎస్ భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది తెరపైకి తెచ్చారు. ఈ కేసులో అప్రూవర్ గా మారిన మరో నిందితుడు దస్తగిరికి కిందికోర్టు క్షమాభిక్ష ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ భాస్కర్ రెడ్డి తెలంగాణ హైకోర్టులోదాఖలు చేసిన రిట్ పిటిషన్ పై నేడు విచారణ జరిగింది.
విచారణ సందర్భంగా భాస్కర్ రెడ్డి తరపు న్యాయవాది వాదిస్తూ ఈ కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగికంగా వేధించారని కోర్టుకు తెలియజేశారు. తల్లిని లైంగికంగా వేధించడం వల్లే వివేకాను సునీల్ యాదవ్ హత్య చేశారని తెలిపారు. ఈ వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. కాగా వివేకా హత్య కేసులో ఇప్పటికే ఎన్నో ట్విస్టులు వెలుగులోకి వచ్చాయి. మరోవైపు ఈ కేసు విచారణను ఏప్రిల్ 30లోగా పూర్తి చేయాలని సీబీఐకి సుప్రీంకోర్టు డెడ్ లైన్ విధించిన సంగతి తెలిసిందే.