ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో మరోసారి అగ్ని ప్రమాదం జరిగింది. అనేక ఫైరింజన్లు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పుతున్నాయి. మహాకుంభ్‌నగర్ ప్రాంతంలోని సెక్టార్ 18వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటి వరకు ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది.
“ఓల్డ్ జిటి రోడ్‌లోని తుల్సీ చౌరాహా సమీపంలోని ఒక శిబిరంలో మంటలు చెలరేగాయి. అయినప్పటికీ, అగ్నిమాపక సిబ్బంది మంటను అదుపులోకి తీసుకురాగలిగారు” అని వార్తా సంస్థ పిటిఐ ఉటంకిస్తూ ఖాక్ చౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ యోగేష్ చతుర్వేది చెప్పారు.
ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం.. మహా కుంభమేళాలో గంగా, యమునా , సరస్వతి నది పవిత్రమైన సంగమంలో ఇప్పటి వరకు 397.4 మిలియన్లకు పైగా ప్రజలు పవిత్ర స్నానాలు చేశారని చెప్పారు.