కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముందు అంగన్వాడీల ధర్నా చేశారు. జీఓ నంబర్ 10ని రద్దు చేసి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద టీచర్లకు రెండు లక్షలు, హెల్పర్స్‌కు లక్ష వీఆర్ఎస్ సౌకర్యం కల్పిస్తూ కొత్త జీఓ జారీ చేయాలన్నారు. హెల్పర్లకు పాత పద్ధతిలో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని.. అంగన్వాడీ ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26 వేతనంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రాష్ట్రంలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు గ్రాట్యూటీ చెల్లించాలన్నారు. రెండవ పీఆర్సీ ప్రకారం ఐదు శాతం ఐఆర్ వర్తింప చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేసి.. తమ సమస్యల పరిష్కారం కోసం తక్షణమే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎండాకాలంలో ప్రభుత్వ పాఠశాలలతో సమానంగా అంగన్వాడీ కేంద్రాలకు వేసవి సెలవులు ఇవ్వాలని కోరారు.