2024లోనూ సీఎం జగనే గెలుస్తారని మంత్రి అంబటి రాంబాబు(Ambati Rambabu) అన్నారు. ప్రజల్లో నాయకులుగా ఉన్న వాళ్ళకే ఇప్పుడు సీట్లు వస్తాయని మంత్రి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఎన్నికల సమయంలో మాత్రమే నాయకులు బయటికి వచ్చేవాళ్ళు.. కానీ, ఇప్పుడు పరిస్థితి అలా కాదని ప్రతి ఇంటికి, ప్రతి గడపకు తిరిగిన వారే నాయకుడని అన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసే బాధ్యత మనందరిపై ఉందన్నారు. ప్రతిఒక్కరు దీనికి ఛాలెంజ్ గా తీసుకొని పనిచేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో గెలిపించే బాధ్యత మనమీద ఉందన్నారు.
Read Also: విశాఖ స్టీల్ ప్లాంట్ పై మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు