Avinash Reddy |వైఎస్ వివేక హత్య కేసు విచారణలో భాగంగా కడప ఎంపీ అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డి పాత్రపై సీబీఐ అధికారులు దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే జనవరి 28, ఫిబ్రవరి 24, మార్చి 10న అవినాష్‌రెడ్డిని విచారించారు. నేటి విచారణ నేపథ్యంలో తనకు స్టే ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించారు. రిట్ పిటిషన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వ్‌లో ఉంచింది. సీబీఐ విచారణలో తాము జోక్యం చేసుకోలేమంటూ స్పష్టం చేసింది. అవినాష్‌రెడ్డి సీబీఐ విచారణ సమయంలో అధికారులు వీడియో, ఆడియో రికార్డు చేయనున్నట్లు తెలుస్తోంది.
Read Also: పవన్ కళ్యాణ్ యాత్ర కోసం ‘వారాహి’ వాహనం సిద్ధం
Follow us on: Youtube Instagram