మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పులివెందుల నుంచి హైదరాబాద్ కు ఆయనను అధికారులు తరలించారు. దీంతో భాస్కర్ రెడ్డిని తీసుకెళ్తున్న వాహనాన్ని అనుచరులు అడ్డుకున్నారు. భాస్కర్ రెడ్డి అరెస్టుతో పులివెందుల, కడపలో హైటెన్షన్ నెలకొంది. మరోవైపు హైదరాబాద్ లోని ఎంపీ అవినాశ్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు చేరుకున్నారు. మొన్న ఉదయ్, నేడు భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.
Also Read: పులివెందులలో తీవ్ర ఉత్కంఠ.. అవినాశ్ రెడ్డి ఇంట్లో సీబీఐ అధికారులు