AP budget |రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. ఉభయసభలను ఉద్దేశించి మొదటగా గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగిస్తున్నారు. ఆయన మట్లాడుతూ.. ఏపీలో నాలుగేళ్లుగా పారదర్శక పాలన జరుగుతోందన్నారు. డీబీటీ ద్వారా నేరుగా లబ్ధిదారులకే నగదు వస్తుందని అన్నారు. రాష్ట్రంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని అన్నారు. వలంటీర్ల ద్వారా ఇంటివద్దే పెన్షన్ ఇస్తున్నామని అన్నారు. నవరత్నాలతో రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతుందని జగన్ ప్రభుత్వాన్ని గవర్నర్ అభినందించారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సులో మొత్తం రూ.13.42 లక్షల కోట్ల పెట్టుబడులకు 378 ఎంవోయూలు కుదుర్చుకున్నామని.. 16 కీలక రంగాల్లో 6 లక్షల ఉద్యోగాలు సృష్టించబడతాయన్నారు గవర్నర్. వైద్య శాఖ ద్వారా 1.4కోట్ల ఆరోగ్య కార్డులను జారీ చేశామన్నారు.
పేద పిల్లలకు ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్య అందిస్తున్నామని అన్నారు. రాష్ట్రంలోని యువత ప్రపంచస్థాయిలో పోటీపడేలా విద్యారంగంలో మార్పులు తెచ్చామని గవర్నర్ నజీర్ అన్నారు. విద్యాప్రమాణాలు పెంచేందుకు రాష్ట్రప్రభుత్వం కృషి చేస్తుందన్నాడు. రాష్ట్ర విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీ పడేవిధంగా విధ్యాబోధన ఉందని అన్నారు. విద్యాసంస్కరణలో కీలక అంశంగా డిజిటల్ లెర్నింగ్ ని తీసుకొచ్చామన్నారు. విద్యార్థులకు 690 కోట్ల విలువైన 5.20 లక్షల ట్యాబ్ లను పంపిణీ చేశామన్నారు.
AP budget |జగనన్న విద్యాకానుక కింద ద్విభాషా పాఠ్య పుస్తకాలు,, ఇంగ్లీష్ ల్యాబులు పంపిణీ చేశామన్నారు. 2020-21 విద్యా సంవత్సరం నుంచి పాఠ్యంశ సంస్కరణలు అమలు చేస్తున్నామని అన్నారు. 1 వ తరగతి నుంచి 7 వ తరగతి వరకు పాఠ్య పుస్తకాల రీ డిజైన్ చేశామన్నారు. ప్రతి మండలంతో కనీసం 2 జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు.
అలాగే జగనన్న గోరుముద్ద ద్వారా ఇప్పటివరకు రూ. 3239 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని అన్నారు. ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తున్నఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. జగనన్న విద్యాదీవెన కింద ఫీజు రీఎంబెర్స్ మెంట్ ను కొనసాగిస్తున్నామని అన్నారు. విద్యా దీవెన క్రింద హాస్టల్, మెస్ చార్జీల కోసం రూ. 20 వేలు ఇస్తున్నామని అన్నారు. విజయనగరంలో జేఎన్టీయూ – గురజాడ , ఒంగోలులో ఆంద్రకేసరి వర్శిటీ ఏర్పాటు చేశామన్నారు. కడపలో డా. వై ఎస్ ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్స్ ఆర్ట్స్ వర్శిటీ ఏర్పాటు చేశామని అన్నారు. ఉన్నత విద్యకోసం 14 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేశామని అన్నారు.
Read Also: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్!
Follow us on: Youtube Instagram