అమరావతి: ఏపీ అసెంబ్లీ(AP Assembly)సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే హౌస్ లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. గవర్నర్ ప్రసంగం జరుగుతున్న సమయంలో వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి(Anam Ramanarayana Reddy) టీడీపీ సభ్యుల వైపు కూర్చున్నారు. వైసీపీ(YCP) సభ్యుల వైపు కూర్చోకుండా.. టీడీపీ(TDP) ఎమ్మెల్యేల వైపు ఆనం కూర్చోవడం హాట్ టాపిక్ గా మారింది. గత కొన్ని రోజులుగా ఆనం వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలపై బహిరంగంగానే ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో సీరియస్ అయిన ఆ పార్టీ అధిష్టానం వెంకటగిరి వైసీపీ ఇంచార్జ్ పదవి నుంచి తప్పించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలో చేరతారనే ప్రచారం జోరందుకుంది. ఇలాంటి తరుణంలో ఆయన అసెంబ్లీలో టీడీపీ సభ్యుల వైపు కూర్చోవడం చర్చనీయాంశమైంది.
Read Also: సీబీఐ విచారణకు హాజరైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి
Follow us on: Youtube Instagram