అనంతపురం జిల్లా పోలీసులు మరోసారి భారీగా సెల్ ఫోన్లను రికవరీ చేశారు. ఎవరైనా సెల్ ఫోన్లు పోగొట్టున్నా.. లేదా చోరీకి గురైనా ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు లేకుండా వాట్సాప్ ఫిర్యాదుతో జిల్లా పోలీసులు ఫోన్లు రికవరీ చేస్తున్నారు. చాట్ బాట్ పేరుతో ఈ సేవలను పోలీసులు అందిస్తున్నారు. తాజాగా 53 లక్షల రూపాయల విలువైన 266 సెల్ ఫోన్లను ఈసారి రికవరీ చేశారు. ఇందులో మిస్ అయినవి 221 కాగా.. చోరీ అయినవి 45 మొబైల్ ఫోన్లు ఉన్నాయి. ఇప్పటి వరకు చాట్ బాట్ సేవల ద్వారా 15 కోట్ల 04 లక్షల విలువైన 8 వేల 886 ఫోన్లు రికవరీ చేసినట్టు ఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. వీటిలో అనంతపురం, శ్రీ సత్యసాయి, చిత్తూరు, కర్నూలు, విశాఖ జిల్లాలు, కర్ణాటక, తెలంగాణ నుండి సెల్ ఫోన్ రికవరీ చేశారు.


