బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అటు ద్రోణి ప్రభావంతో హైద రాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే పరిస్థితులు కన్పిస్తున్నాయి. మొన్నటి వరకు ఎండలు దంచికొట్టగా ఇప్పుడు ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తుండడంతో వేడి గణనీ యంగా తగ్గిపోయింది. దీంతో మండే ఎండల నుంచి ప్రజలంతా కాస్త ఊపిరిపీల్చుకుంటున్న పరిస్థితి.