తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిశారు. తన సోదరుడి కుమార్తె వివాహానికి రావాలని శుభలేఖ ఇచ్చి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా సీఎంను కలిసి వివాహానికి ఆహ్వానించడం అందరి దృష్టిని ఆకర్షించింది.