న్యూయార్క్ లోని హర్లేమ్ లో ఓ అపార్ట్ మెంట్ లో జరిగిన అగ్నిప్రమాదంలో 27 ఏళ్ల భారత జాతీయుడు చనిపో యారు. మరో 17 మంది గాయపడ్డారు. మరణించిన వ్యక్తిని ఫాజిల్ ఖాన్ గా గుర్తించారు. న్యూయార్క్ అగ్నిమాపక శాఖ కథనం ప్రకారం భవనంలో లిథియం-అయాన్ బ్యాటరీ కారణంగా మంటలు చెలరేగాయి. ఇది హార్లేమ్ లోని ఆరు అంతస్తుల అపార్ట్మెంట్ భవనం – సెయింట్ నికోలస్, ఈ ప్రమాదంలో ఫాజిల్ ఖాన్ చనిపోగా 17 మంది గాయపడ్డారు. మూడో అంతస్తులో శుక్రవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మంటలు చెలరేగాయి. మొత్తం 18 మంది మంటల్లో చిక్కుకున్నారు. గాయాలతో 12 మందిని ఆస్పత్రిలో చేర్చారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ఫాజిల్ ఖాన్ ఒక్కడే చనిపోయాడు. ఖాన్ మృతదేహాన్ని భారత దేశానికి రప్పించేందుకు అక్కడి దౌత్య కార్యాలయంతో సంప్రదించారు. ఏర్పాట్లు చేస్తున్నారు. అగ్నిప్రమాదం తర్వాత మొత్తం బిల్డింగ్ లో అందరినీ ఖాళీ చేయిస్తున్నారు.
న్యూయార్క్ లో అపార్ట్ మెంట్ లో అగ్నిప్రమాదం
0
247
Previous article
Latest Articles
రాయదుర్గంలో అర్ధరాత్రి రేసింగ్.. కానిస్టుబుల్ కు గాయాలు
హైదరాబాద్ రాయదుర్గం పరిధిలో అర్ధరాత్రి యువకుల రేసింగ్ కలకలం రేపింది. కార్లకు భారీ సౌండ్ సైలెన్సర్లు పెట్టి రాత్రి వేళల్లో రాష్ డ్రైవింగ్ చేస్తోంది యువత. వీకెండ్స్ లో పోలీసుల కళ్ళు గప్పి...
- Advertisement -
- Advertisement -


