అల్లు అర్జున్‌పై బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ ప్రశంసలు కురిపించారు. బన్నీ వర్క్‌కు తాను అభిమానినని అన్నారు. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పుష్ప2 సినిమా. ఆదరణను సొంతం చేసుకుంటోంది. పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన ఈ సినిమా ప్రచారంలో భాగంగా అల్లు అర్జున్ అన్ని ప్రముఖ నగరాల్లో ఈవెంట్‌లు నిర్వహించారు.
అమితాబ్ అంటే తనకు ఎంతో ఇష్టమని గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలిపారు.. ఆయన ఎన్నో సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో స్టార్‌గా ఉన్నారని.. ఎంతోమంది నటీనటులకు ఆయన స్ఫూర్తి అని చెప్పారు. అమితాబ్ సినిమాలు చూస్తూ పెరిగానన్నారు. ఆయన స్ఫూర్తితోనే తాను ముందుకువెళ్తున్నట్లు చెప్పారు. తాజాగా ఈ వీడియోను అమితాబ్ షేర్ చేశారు.