19.2 C
Hyderabad
Thursday, February 5, 2026
spot_img

భువనగిరి బీజేపీ సభలో పాల్గొన్న అమిత్ షా

   తెలంగాణలో పది సీట్లకు పైగానే తాము గెలుస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రేవంత్ రెడ్డి వినూ.. గత ఎన్నికల్లో నాలుగు స్థానాలను మాత్రమే గెలిచామని, ఈసారి పదికి పైగా స్థానాలను గెలుస్తామని అంటూ సవాల్ విసిరారు. భువనగిరిలో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగిం చారు. కాంగ్రెస్ పార్టీకి ఇక్కడపోటీ చేయడానికి అభ్యర్థులు కూడా దొరకడం లేదన్నారు. అయినా వేరే పార్టీ నుంచి తెచ్చుకుని మరీ పోటీకి దింపారన్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో గెలిస్తే దేశంలో బీజేపీకి నాలుగు వందల స్థానాలు వచ్చినట్లేనని అన్నారు. మోదీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారం టూ అసత్య ప్రచారాన్ని చేస్తూ ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు.

  భువనగిరిలో రాహుల్ చెంచాకు టిక్కెట్ ఇచ్చారని అమిత్ షా విమర్శించారు. తెలంగాణలో ముస్లిం లకు నాలుగు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ద్వారా మిగిలిన సామాజికవర్గాల ఉన్నతికి అడ్డుపడింద న్నారు. బీజేపీకి పది స్థానాలు ఇస్తే ముస్లిం రిజర్వేషన్లు తొలగించి, ఆ రిజర్వేషన్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ లకు ఇస్తామని తెలిపారు. మోదీ గ్యారంటీలను తప్పనిసరిగా అమలు చేస్తామని తెలిపారు. రాహుల్ చెప్పే గ్యారంటీలు ఏమాత్రం పనికి రావని అన్నారు. రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తా మని చెప్పి కాంగ్రెస్ ఇంతవరకూ చేసిందా? అని ప్రశ్నించారు. రైతులకు పదిహేను వేల పెట్టుబడి ఇస్తామని చెప్పి ఇంతవరకూ ఇవ్వలేదన్నారు.

Latest Articles

‘టిఎస్ఆర్ మూవీ మేకర్స్’ ప్రొడక్షన్ నం. 3 ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్

టిఎస్ఆర్ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ప్రొడక్షన్ నెంబర్ 3, ప్రేమ మరియు కుటుంబ బంధాలను అద్భుతంగా ఆవిష్కరించే ఒక హృదయస్పర్శి చిత్రంగా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత తిరుపతి శ్రీనివాసరావు...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్