స్వతంత్ర, వెబ్ డెస్క్: ఏపీలో ముందస్తు ఎన్నికలు జరగనున్నాయనే ప్రచారం నేపథ్యంలో రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. ఇప్పటికే టీడీపీ మహానాడులో మినీ మేనిఫెస్టో ప్రకటించి దూకుడు మీద ఉంది. అలాగే నియోజకవర్గాల అభ్యర్థులను సైతం ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంపై దృష్టి పెట్టిన బీజేపీ కేంద్ర పెద్దలు వరుస పర్యటనలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 8న కేంద్ర హోంమంత్రి అమిత్ షా విశాఖకు రానున్నారు. అక్కడ జరిగే పార్టీ కార్యక్రమాల్లో పాల్గొని బహిరంసభలో ప్రసగించనున్నారు. ఇదే నెల 10న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం తిరుపతికి రానున్నారు. ఇందుకోసం ఏర్పాట్లలో రాష్ట్ర నేతలు బిజీ అయిపోయారు.
మరోవైపు జనసేనతో పొత్తు ఉంటుందని బీజేపీ నేతలు చెబుతుండగా.. పవన్ కల్యాణ్ మాత్రం టీడీపీతో పొత్తుకు ఓకే చెప్పారు. బీజేపీ. టీడీపీ, జనసేన కలిసి పోటీచేస్తే వైసీపీని ఈజీగా ఓడించవొచ్చని జనసేనాని భావిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం టీడీపీతో కలవడానికి ససేమిరా అంటోంది. ఈ తరుణంలో కమలం అగ్రనేతల పర్యటనతో అయినా పొత్తులపై క్లారిటీ వస్తుందో? లేదో? వేచి చూడాలి.