హీరో అల్లు అర్జున్ కాసేపట్లో నాంపల్లి కోర్టుకు హాజరుకానున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో న్యాయస్థానం విధించిన 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఇవాళ్టితో ముగియనుంది. ఇదే కేసులో హైకోర్టు అల్లు అర్జున్‌కు మధ్యంతర బెయిల్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ కాసేపట్లో కోర్టుకు హాజరుకానున్నారు. అల్లు అర్జున్ తరఫు న్యాయవాదులు హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయాన్ని తెలపనున్నారు.