అక్కినేని అందగాడు, యంగ్ హీర్ అఖిల్ నటించిన పాన్ ఇండియా చిత్రం ‘ఏజెంట్'(Agent) మూవీ థియేట్రికల్ ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతుంది. మంగళవారం రాత్రి కాకినాడలో గ్రాండ్ గా విడుదల చేసిన ఈ ట్రైలర్ 5మిలియన్స్ కి పైగా వ్యూస్ తో అలరిస్తోంది. యూట్యూబ్ ట్రెండింగ్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. ట్రైలర్ చూస్తుంటే సినిమాలో భారీ యాక్షన్స్ సీక్వెన్స్ ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. అఖిల్ లుక్, బాడీ లాంగ్వేజ్ అంతా కొత్తగా ఉంది. ఈ మూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో నటిస్తుండడం సినిమాకు పెద్ద ప్లస్. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 28న దేశవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సినిమాతో అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడం ఖాయమని అక్కినేని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
Agent Trailer:
Read Also: గ్రాండ్ గా ‘వీరసింహారెడ్డి’ 100రోజుల వేడుక
Follow us on: Youtube, Koo, Google News